Maharashtra Shocker: దారుణం, ఆస్పత్రిలో పేషెంట్‌తో పాటు డాక్టర్ మీద ఐరన్‌ రాడ్‌తో దాడి, వీడియో ఇదిగో..

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ (ఔరంగాబాద్‌)లో గల ఘాటి ప్రభుత్వ హాస్పిటల్‌లో గ్యాంగ్‌వార్ (Gang War At Hospital) చోటు చేసుకుంది. వార్డులోకి వచ్చిన గూండాలు ఒక పేషెంట్‌తోపాటు మహిళా డాక్టర్‌పై ఐరన్‌ రాడ్‌తో దాడి చేశారు. దీంతో వారిద్దరూ గాయపడ్డారు

Violent Gang Attack at Ghati Hospital in Chhatrapati Sambhajinagar Leaves Female Doctor

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్ (ఔరంగాబాద్‌)లో గల ఘాటి ప్రభుత్వ హాస్పిటల్‌లో గ్యాంగ్‌వార్ (Gang War At Hospital) చోటు చేసుకుంది. వార్డులోకి వచ్చిన గూండాలు ఒక పేషెంట్‌తోపాటు మహిళా డాక్టర్‌పై ఐరన్‌ రాడ్‌తో దాడి చేశారు. దీంతో వారిద్దరూ గాయపడ్డారు.ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. వీడియోలో బెడ్‌పై ఉన్న ఒక రోగితో ఎవరి గురించో ఆరా తీశారు.

ఆడుదాం ఆంధ్రాలో తన్నుకున్న కబడ్డీ ప్లేయర్లు, నందికొట్కూరు కళాశాల మైదానంలో ఘర్షణ, వీడియో ఇదిగో..

అనంతరం తలపై గాయంతో డాక్టర్‌ వద్దకు వెళ్లిన వ్యక్తిపై ఇనుప రాడ్‌తో దాడి చేశారు. ఈ క్రమంలో అతడి పక్కనే ఉన్న మహిళా డాక్టర్‌ తలకు కూడా రాడ్‌ దెబ్బ తగిలింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటనపై ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నతాధికారులు స్పందించారు. గూండాల దాడి గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే దాడిని నివారించలేకపోయిన నలుగురు సెక్యూరిటీ సిబ్బందిని సస్పెండ్‌ చేశారు.

  Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now