Manchu Family Conflict: వీడియో ఇదిగో, మంచు మనోజ్‌ను ఇంటి నుంచి గెంటేసిన విష్ణు, భార్య మౌనికతో సహా బయటకు వచ్చేసిన మనోజ్, ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నానంటూ ఆవేదన

మంచు మోహన్‌ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తనపై దాడి చేశారని మంచు మనోజ్‌.. చిన్న కొడుకు మనోజ్‌తో ప్రాణ హానీ ఉందని మోహన్‌ బాబు ఒకరిపై ఒకరు పోలీసుకు ఫిర్యాదు చేసుకున్నారు.

Manch Manoj (photo-X/Video Grab)

మంచు మోహన్‌ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. తనపై దాడి చేశారని మంచు మనోజ్‌.. చిన్న కొడుకు మనోజ్‌తో ప్రాణ హానీ ఉందని మోహన్‌ బాబు ఒకరిపై ఒకరు పోలీసుకు ఫిర్యాదు చేసుకున్నారు.ఇదిలా ఉంటే హైదరాబాద్‌ శివార్లలోని జల్‌పల్లిలో ఉన్న మోహన్‌ బాబు ఫామ్‌హౌస్‌ ‘మంచు టౌన్‌’కి మనోజ్‌తో పాటు మంచు విష్ణు కూడా బౌన్సర్లను పంపించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి బౌన్సర్లను బయటకు పంపించారు.

చిన్నపాటి వివాదాలే.. మా ఫ్యామిలీ వ్యవహారాన్ని పెద్దది చేసి చూపించడం తగదు.. తమ కుటుంబ వివాదంపై మంచు విష్ణు స్పందన (వీడియో)

అయితే తన అనుచరులను మాత్రమే పోలీసులు బెదిరిస్తున్నారని మంచు మనోజ్‌ ఆరోపించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన అనుచరుల పేర్లు రాసుకొని మరీ బయటకు పంపిస్తున్నారని, వాళ్ల(మోహన్‌ బాబు, విష్ణు) బౌన్సర్లను మాత్రం లోపలికి పంపిస్తున్నారని ఆరోపించారు. ‘నేను డబ్బు కోసమో, ఆస్తుల కోసమో పోరాటం చేయడం లేదు.. ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నాను. నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదు. న్యాయం కోసం అందరిని కలుస్తాను’ అని మంచు మనోజ్‌ మీడియాతో తెలిపారు. అనంతరం భార్యతో కలిసి మోహన్‌బాబు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.

మంచు మనోజ్‌ను ఇంటి నుంచి గెంటేసిన విష్ణుమంచు మనోజ్‌ను ఇంటి నుంచి గెంటేసిన విష్ణు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now