Manchu Manoj, Manchu Vishnu, Manchu Mohan Babu (photo-X)

Hyderabad, Dec 10: మంచు ఫ్యామిలీ వివాదం సెగలు పుట్టిస్తుంది. తండ్రీకొడుకులు మోహ‌న్‌ బాబు (Mohan Babu), మ‌నోజ్ (Manoj) ఒక‌రిక‌పై ఒక‌రు పోలీసుల‌కు ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇరువురి నుంచి ఫిర్యాదులు స్వీక‌రించిన ప‌హాడిష‌రీఫ్ పోలీసులు మంగ‌ళ‌వారం రెండు కేసులు న‌మోదు చేసిన‌ట్లు తెలుస్తోంది. కాగా ఈ వివాదంపై మంచు విష్ణు స్పందించారు. తమ కుటుంబంలో చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు మంచు విష్ణు తెలిపారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌ కు వచ్చిన ఆయన ఈ మేరకు మాట్లాడారు. తమ ఫ్యామిలీ వ్యవహారాన్ని పెద్దది చేసి చూపించడం తగదని హితవు పలికారు. త్వరలోనే తమ కుటుంబ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.

వేడెక్కిన ‘మంచు’ వివాదం.. మోహ‌న్‌ బాబు, మ‌నోజ్ ఫిర్యాదుల మేరకు రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు

Here's Video:

అసలేమిటీ వివాదం?

మంచు మనోజ్ తన భార్యా పిల్లలతో ఇంట్లో ఉండగా, పది మంది గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు, నాలుగు నెలల క్రితం తన ఇంటి నుంచి వెళ్లిపోయిన మంచు మనోజ్... మళ్లీ తన ఇంటికి వచ్చి, కొందరు సంఘ విద్రోహ శక్తులతో కలిసి అలజడి సృష్టిస్తున్నాడని మోహన్ బాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పుష్ప చిత్రంలో విలన్ గా నటించిన తారక్ పొన్నప్పకు క్రికెటర్ కృనాల్ పాండ్యాకు ఉన్న రిలేషన్ ఏంటి..? నెటిజన్లు ఎందుకు అతడిని కృనాల్ పాండ్యాతో కలుపుతున్నారు..