Medak Road Accident: మెదక్ జిల్లా రోడ్డు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
ఉసిరికపల్లి-వెల్దుర్తి రహదారిలో కారు అతివేగంగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మెదక్ జిల్లా శివంపేట పీఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉసిరికపల్లి-వెల్దుర్తి రహదారిలో కారు అతివేగంగా రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు. మృతులు పాము బండ తండాకు చెందిన వారికిగా గుర్తించారు. ఈ ఘటనలో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
మెదక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురి ప్రాణాలు తీసిన రోడ్డుపై ఉన్న గుంత, ఇందులో ముగ్గురు చిన్నారులు
మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఈ రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Here's Accident Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)