Noida Model Dies: ఫ్యాషన్‌ షోలో ర్యాంప్ వాక్ చేస్తుండగా మీద పడిన స్థంభం, అక్కడికక్కడే మృతి చెందిన నోయిడా మోడల్

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా (Noida)లో జరిగిన ఓ ఫ్యాషన్‌ షో (Fashion Show) ఈవెంట్‌లో మోడల్స్‌ ర్యాంప్‌వాక్‌ చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ లైట్లను అమర్చిన ఇనుప స్తంభం (లైటింగ్‌ ట్రస్‌) వారి మీదపడింది. ఈ ఘటనలో ఓ మోడల్‌ (Model) అక్కడికక్కడే మృతిచెందింది.

nshika Chopra Dies in Accident During Fashion Show. (Photo Credits: Twitter Video Grab)

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా (Noida)లో జరిగిన ఓ ఫ్యాషన్‌ షో (Fashion Show) ఈవెంట్‌లో మోడల్స్‌ ర్యాంప్‌వాక్‌ చేస్తుండగా.. ప్రమాదవశాత్తూ లైట్లను అమర్చిన ఇనుప స్తంభం (లైటింగ్‌ ట్రస్‌) వారి మీదపడింది. ఈ ఘటనలో ఓ మోడల్‌ (Model) అక్కడికక్కడే మృతిచెందింది.నోయిడా ఫిల్మ్‌ సిటీ (Noida Film City)లోని లక్ష్మీ స్టూడియోల్‌లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనలో ఈవెంట్‌లో పనిచేస్తున్న బాబీ రాజ్‌ అనే మరో వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఫ్యాషన్‌ షోకు అనుమతి లేకపోయినా నిర్వాహకులు ఈవెంట్‌ను నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈవెంట్‌ ఆర్గనైజర్‌తో పాటు మరో నలుగురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement