Mother Dairy Milk Price Hike: పాల ధరను రెండు రూపాయలు పెంచిన మదర్ డెయిరీ, అన్ని రకాల ఉత్పత్తులపై రూ.2 పెంచినట్లు వెల్లడి
అన్ని రకాల ఉత్పత్తులపై రూ.2 మేర ధరలు పెంచినట్లు మదర్ డెయిరీ సోమవారం తెలిపింది. గత 15 నెలలుగా ఇన్‌పుట్ కాస్ట్ పెరగడంతో పాల ధరలు పెంచక తప్పలేదని పేర్కొంది.
ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ మదర్ డెయిరీ (Mother Dairy) పాల ధరలను (increased prices) రెండు రూపాయలు పెంచేసింది. అన్ని రకాల ఉత్పత్తులపై రూ.2 మేర ధరలు పెంచినట్లు మదర్ డెయిరీ సోమవారం తెలిపింది. గత 15 నెలలుగా ఇన్‌పుట్ కాస్ట్ పెరగడంతో పాల ధరలు పెంచక తప్పలేదని పేర్కొంది. పెరిగిన ధరలు ఢిల్లీ ఎన్ సీఆర్ పరిధిలో సోమవారం నుంచే (జూన్ 3) అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే దేశ వ్యాప్తంగా ఈ ధరలు అమల్లోకి వస్తాయా లేదా అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.
తాజా పెంపుతో టోకెన్ మిల్క్ (బల్క్ వెండెడ్ మిల్క్) లీటర్ ధర రూ.2 పెరిగి రూ.52 నుంచి రూ.54కు చేరింది. అదే సమయంలో టోన్డ్ మిల్క్ లీటర్ ధర రూ.54 నుంచి రూ.56కు, ఆవు పాల ధర రూ.56 నుంచి రూ.58కి, ఫుల్ క్రీమ్ మిల్క్ ధర రూ.66 నుంచి రూ.68కి, గేదె పాలు లీటరు ధర రూ.70 నుంచి రూ.72కు డబుల్ టోన్డ్ మిల్క్ ధర రూ.48 నుంచి రూ.50కి పెరిగింది.
Here's News