MP Asaduddin Owaisi: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి జడ్ ప్లస్ కేటగిరి భద్రత, సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తామని తెలిపిన కేంద్రం
దీంతో అసదుద్దీన్‌కు సీఆర్పీఎఫ్ బలగాలు భద్రత కల్పించనున్నారు. కాగా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి ( MP Asaduddin Owaisi ) జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో అసదుద్దీన్‌కు సీఆర్పీఎఫ్ బలగాలు భద్రత కల్పించనున్నారు. కాగా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని హపూర్ జిల్లా నుంచి ఢిల్లీ వెళ్తుండగా.. హపూర్- ఘజియాబాద్ మార్గంలోని చిజారసీ టోల్‌ప్లాజా వద్ద ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ కేసులో నిన్ననే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు యూపీ ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఓ మతానికి వ్యతిరేకంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయని, దీంతోనే ఒవైసీపై కాల్పులు జరిపినట్లు చెప్పారన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)