Dhule Truck Accident Video: సీసీటీవీ పుటేజీ ఇదిగో, వేగంగా వెళుతూ అదుపుతప్పి కారును ఢీకొట్టిన ట్రక్కు, 10 మంది మృతి, మరో 20 మందికి గాయాలు

మ‌హారాష్ట్ర‌లోని ధులే జిల్లాలో మంగ‌ళ‌వార ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వ‌చ్చిన ట్ర‌క్కు అదుపుత‌ప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ప‌ది మంది అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 20 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

CCTV Video of Accident. (Photo Credits: Twitter Video Grab)

మ‌హారాష్ట్ర‌లోని ధులే జిల్లాలో మంగ‌ళ‌వార ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వ‌చ్చిన ట్ర‌క్కు అదుపుత‌ప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ప‌ది మంది అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందారు. మ‌రో 20 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఉద‌యం 10:45 గంట‌ల స‌మ‌యంలో ముంబై – ఆగ్రా హైవేపై వేగంగా దూసుకెళ్తున్న ట్ర‌క్కు.. అదుపుత‌ప్పి ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. దీంతో కారు రోడ్డుప‌క్క‌కు ఎగిరిప‌డింది. రోడ్డు ప‌క్క‌న నిల్చున్న వారు కూడా గాల్లో ఎగిరిప‌డ్డారు. కొంద‌రు బ‌స్సు కోసం వెయిట్ చేస్తుండ‌గా, కారు – ట్ర‌క్కు వారిపైకి దూసుకెళ్లిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. వీరిలో కొంద‌రు చ‌నిపోగా, మ‌రికొంద‌రు గాయ‌ప‌డ్డారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వీడియో ఇదిగో,

PTI Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement