Akhanda 2 Release Date: ఈ నేల అసురుడిది కాదురా.. ఈశ్వరుడిది, గూస్ బంప్స్ తెప్పిస్తున్న బాలయ్య అఖండ 2 ప్రోమో, వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న సినిమా విడుదల

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం అఖండ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి విదితమే. ఈ మూవీకి సీక్వెల్‌గా అఖండ-2 తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆ మూవీకి సంబంధించి విడుదల తేదీని ప్రకటించారు.

Akhanda 2 Release Date

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం అఖండ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి విదితమే. ఈ మూవీకి సీక్వెల్‌గా అఖండ-2 తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఆ మూవీకి సంబంధించి విడుదల తేదీని ప్రకటించారు. ఈ మేరకు అఖండ-2 తాండవం పేరుతో ప్రోమోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

బన్నీ నా కొడుకు లాంటి వాడు, వివాదాస్పద వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్, అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేయలేదని స్పష్టం

బాలయ్య- బోయపాటి కాంబోలో వస్తోన్న ఈ మూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో బాలయ్య డైలాగ్‌ అభిమానులను అలరిస్తోంది. ఈ నేల అసురుడిది కాదురా.. ఈశ్వరుడిది అంటూ బాలకృష్ణ డైలాగ్స్‌, శివుడి తాండవం చేస్తున్న విజువల్స్‌తో సాగుతున్న ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో బాలయ్య యాక్షన్‌ ఉగ్రరూపం స్పష్టంగా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రాన్ని తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు.

Akhanda 2 Release Date and Teaser Promo

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now