Nayab Singh Saini Sworn In: హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం, ప్రధాని మోదీతో సహా ఎన్డీయే కూటమి నేతలు హాజరు..
గురువారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ (Nayab Singh Saini) ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణం చేయించారు. దీనికి ముందు ఆయన వాల్మీకి ఆలయంలో పూజలు చేశారు.
హర్యానాలో (Haryana)లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ (Nayab Singh Saini) ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణం చేయించారు. దీనికి ముందు ఆయన వాల్మీకి ఆలయంలో పూజలు చేశారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రం వేగంగా ముందుకువెళ్తుందని చెప్పారు. పంచకులలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్డీయే కూటమి నేతలు ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 90 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీకి బీజేపీ నుంచి 48 మంది ఎన్నికయ్యారు. అనంతరం సీఎం ఎంపికపై జరిగిన చర్చల్లో.. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చిన నాయబ్ సింగ్ సైనీవైపే అంతా మొగ్గు చూపారు. బుధవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష భేటీలో ఈమేరకు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Here's Nayab Singh Saini Sworn In Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)