Nepal Shocker: హత్యా...ఆత్మహత్యా.. భారత్- నేపాల్ సరిహద్దుల్లో చెట్టుకు వేలాడుతూ ముగ్గురు అమ్మాయిలు, విచారణ వేగవంతం చేసిన పోలీస్ అధికారులు

భారత్- నేపాల్ దేశ సరిహద్దుల్లో చెట్టుకు ఉరివేసుకుని ముగ్గురు అమ్మాయిలు చనిపోవడం సంచలనంగా మారింది. ఈ టీనేజర్ల మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు.

Teenage Girls in Jhapa district Found Dead Hanging from a Tree (Photo-Twitter)

భారత్- నేపాల్ దేశ సరిహద్దుల్లో చెట్టుకు ఉరివేసుకుని ముగ్గురు అమ్మాయిలు చనిపోవడం సంచలనంగా మారింది. ఈ టీనేజర్ల మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా, వారిది ఆత్మహత్యా.. లేక హత్యా అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. ముగ్గురు మైనర్లు కరీనా గణేష్‌(16), కల్పనా గణేశ్‌(16), అంజలి గణేశ్‌(17).. శనివారం మధ్యాహ్నం నుంచి కనిపించడంలేదని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బసంత పాఠక్ తెలిపారు. ఈ మేరకు వారి పేరెంట్స్‌ మిస్సింగ్‌ కేసుగా ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. కాగా, వీరు ముగ్గురు సుంకోషి టీ గార్డెన్‌లో పనిచేస్తున్నట్టు వెల్లడించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement