Odisha Train Accident: వెంటాడుతున్న రైలు ప్రమాదాలు, ఒడిశాలో రైలు చక్రాల కింద పడి మరో ఆరుగురు మృతి, వీడియో ఇదిగో..

బాలాసోర్‌ రైలు దుర్ఘటన జరిగి వారం కూడా కాలేదు, ఒడిశాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం జాజ్‌పూర్‌-కోయింజర్‌ స్టేషన్‌కు సమీపంలో రైల్వే పనులు చేస్తున్న కొంతమంది కార్మికులపైకి గూడ్స్‌ రైల్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా, మరోముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.వర్షం వస్తుందని గూడ్స్ రైలు కింద తల దాచుకుందామని కార్మికులు వెళ్లారు.

Train (Representational Image. Source-Twitter)

బాలాసోర్‌ రైలు దుర్ఘటన జరిగి వారం కూడా కాలేదు, ఒడిశాలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం జాజ్‌పూర్‌-కోయింజర్‌ స్టేషన్‌కు సమీపంలో రైల్వే పనులు చేస్తున్న కొంతమంది కార్మికులపైకి గూడ్స్‌ రైల్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోగా, మరోముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.వర్షం వస్తుందని గూడ్స్ రైలు కింద తల దాచుకుందామని కార్మికులు వెళ్లారు.

అయితే ఈదురుగాలులకు గూడ్స్ రైలు కదలడంతో చక్రాల కింద నలిగి ఆరుగురు కార్మికులు చనిపోగా ముగ్గురికి కాళ్ళు చేతులు విరిగాయి. ఇదిలా ఉండగా, బుధవారం అస్సాంలోని బోకోకు సమీపంలో బొగ్గును తరలిస్తున్న గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఎల్పీజీ గ్యాస్‌ అన్‌లోడింగ్‌కు వెళ్తుండగా మంగళవారం రాత్రి గూడ్స్‌ రైల్‌ బోగీలు పట్టాలు తప్పాయి.

Video

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement