Andhra Pradesh: వీడియో ఇదిగో, స్కూలులో విద్యార్థిని ఆత్మహత్య, న్యాయం చేయాలంటూ పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌కి అడ్డుపడిన మృతురాలి తల్లిదండ్రులు
ఆలమూరులో ఇటీవల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు పాఠశాల యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు.
రాజమహేంద్రవరం విమానాశ్రయం వద్ద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పదోతరగతి విద్యార్థిని తల్లిదండ్రులు కలిశారు. ఆలమూరులో ఇటీవల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు పాఠశాల యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ పవన్ కాన్వాయ్‌కి అడ్డుపడ్డారు. మధ్యాహ్నం వచ్చి మాట్లాడతానని ఆయన వారికి భరోసా ఇచ్చారు.
ఈస్ట్ గోదావరి జిల్లా చెముడు లంక గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని చెక్కపల్లి వెన్నెల, షిరిడి సాయి విద్యానికేతన్ పాఠశాలలో ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురి మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని, చనిపోయిన తమ కూతురికి న్యాయం చేయాలని చెక్కపల్లి వెన్నెల తల్లిదండ్రులు రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసి, వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించారు. తిరుగు ప్రయాణంలో వారిని కలిసి మాట్లాడి, వారికి న్యాయం జరిగేలా చూస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లు వెన్నెల తల్లిదండ్రులు తెలిపారు.
Parents of Student Who Committed suicide trying to meet Pawan Kalyan to get justice
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)