One Nation One Election Bill: సుప్రీం లీడర్ ఈగో మసాజ్ కోసమే జమిలి ఎన్నికల బిల్లు, సంచలన వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, వీడియో ఇదిగో..

నేడు లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీల మనుగడను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.

Asaduddin Owaisi and PM Modi (photo-ANI)

ఎన్డీయే ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన జమిలి ఎన్నికల బిల్లును హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యతిరేకించారు. నేడు లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీల మనుగడను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ సంక్షేమం కోసం తెచ్చిన బిల్లు కాదని.. సుప్రీం లీడర్ ఈగోను మసాజ్ చేయడానికి మాత్రమే తెచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. ONOE బిల్లులు పరోక్షంగా అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యాన్ని పరిచయం చేసి ప్రాంతీయ పార్టీలను అంతం చేస్తాయని AIMIM నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. లోక్‌సభలో జమిలి బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం, ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లును సభలో ప్రవేశపెట్టిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌

AIMIM leader Asaduddin Owaisi on jamili Bill

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)