Varahi Declaration: పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ఏడు అంశాలు ఇవే, సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా డిక్లరేషన్
తిరుపతిలో ఇవాళ నిర్వహించిన సభలో పవన్ 'వారాహి డిక్లరేషన్' విడుదల చేశారు. ఈ డిక్లరేషన్ లో సనాతన ధర్మ పరిరక్షణ గురించి ప్రస్తావించారు. మొత్తం 7 అంశాలతో ఈ డిక్లరేషన్ రూపొందించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి తరచుగా తన బాణీ వినిపిస్తున్న సంగతి విదితమే. తిరుపతిలో ఇవాళ నిర్వహించిన సభలో పవన్ 'వారాహి డిక్లరేషన్' విడుదల చేశారు. ఈ డిక్లరేషన్ లో సనాతన ధర్మ పరిరక్షణ గురించి ప్రస్తావించారు. మొత్తం 7 అంశాలతో ఈ డిక్లరేషన్ రూపొందించారు.
1. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలి.
2. సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆ విశ్వాసాలకు భంగం కలిగించే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. తక్షణమే అలాంటి చట్టాన్ని తీసుకురావాలి.
3. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కావాలి.
4. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఏటా నిధులు కేటాయించాలి.
5. సనాతన ధర్మాన్ని కించపరిచి, ద్వేషం చిందించే వ్యక్తులకు, వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి.
6. ఆలయాల్లో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగంచే వస్తువుల స్వచ్ఛతను ధృవీకరించే విధానాన్ని తీసుకురాలి.
7. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాకుండా... విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా, సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తిస్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి.
Here's Varahi Declaration
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)