Pinarayi Vijayan Accident: కేరళ సీఎంకు తృటిలో తప్పిన పెనుప్రమాదం, స్కూటర్‌ని తప్పించబోయి ఒకదాని వెంట ఒకటి డీకొన్న 5 కార్లు
కేరళ తిరువనంతపురంలోని వామనపురంలోని రోడ్డుపై కాన్వాయ్ వెళ్తుండగా ఎదురుగా స్కూటర్ వచ్చింది.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) ఎస్కార్ట్ వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్న ఘటన సోమవారంనాడు చోటుచేసుకుంది. కేరళ తిరువనంతపురంలోని వామనపురంలోని రోడ్డుపై కాన్వాయ్ వెళ్తుండగా ఎదురుగా స్కూటర్ వచ్చింది. ఊహించని ఈ పరిణామంతో ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని 5 కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి.
ఎస్కార్ట్ వాహనాల్లోని మొదటి వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆ వెనుక ఉన్న ఎస్కార్ట్ వాహనాలు ఒకదానిని ఒకటి ఢీకొన్నాయని సమాచారం. ఈ ఘటనలో ముఖ్యమంత్రి వాహనం కూడా స్వల్పంగా దెబ్బతింది. అయితే, సీఎంకు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ఎలాంటి జాప్యం లేకుండా ముఖ్యమంత్రి తన ప్రయాణం కొనసాగిచారు.
Pinarayi Vijayan Accident:
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)