PM Kisan 19th Instalment Released: రైతులకు గుడ్ న్యూస్, పీఎం కిసాన్ 19వ విడత నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ, 9.80 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి నగదు
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద 19వ విడత నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. సోమవారం బిహార్‌లోని భాగల్‌పూర్‌లో రూ. 22 వేల నగదును ప్రధాని విడుదల చేశారు. దీని ద్వారా 9.80 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద 19వ విడత నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. సోమవారం బిహార్‌లోని భాగల్‌పూర్‌లో రూ. 22 వేల నగదును ప్రధాని విడుదల చేశారు. దీని ద్వారా 9.80 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది. ఇక 18వ విడతలో.. 2023, అక్టోబర్ 5వ తేదీన మహారాష్ట్రలోని వాషిమ్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ నగదు విడుదల చేశారు. ఈ విడతలో దాదాపు 9 కోట్ల మంది రైతల ఖాతాల్లో రూ. 20 వేల కోట్ల నగదు జమ అయిన విషయం విదితమే.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019లో.. ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. అది కూడా మూడు విడతలుగా.. రూ. 2 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు 19 విడతల్లో దాదాపు రూ. 2 లక్షల కోట్లకు పైగా రైతుల ఖాతాలకు నగదును కేంద్రం జమ చేసింది.
PM Kisan 19th Instalment Released:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)