Har Ghar Tiranga: ప్రొఫైల్ పిక్‌గా జాతీయ పతాకాన్ని పెట్టుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆగస్ట్ 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరు తమ ప్రొఫైల్ పిక్‌గా జాతీయ జెండాను పెట్టుకోవాలని పిలుపు
తన ప్రొఫైల్ పిక్ గా జాతీయ పతాకాన్ని పెట్టుకున్నారు. మంగళవారం ఈ మార్పు కనిపించింది. ఆగస్ట్ 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరు తమ ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాను పెట్టుకోవాలంటూ ప్రధాని మోదీ పిలుపునివ్వడం తెలిసిందే.
ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ ఖాతాలో మార్పులు చేశారు. తన ప్రొఫైల్ పిక్ గా జాతీయ పతాకాన్ని పెట్టుకున్నారు. మంగళవారం ఈ మార్పు కనిపించింది. ఆగస్ట్ 2 నుంచి 15 వరకు ప్రతి ఒక్కరు తమ ప్రొఫైల్ పిక్ గా జాతీయ జెండాను పెట్టుకోవాలంటూ ప్రధాని మోదీ పిలుపునివ్వడం తెలిసిందే. దీంతో 2వ తేదీ నుంచి ప్రధాని సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్ పిక్ గా త్రివర్ణ పతాకం కనిపిస్తోంది.
నేడు ప్రత్యేకమైన ఆగస్ట్ 2. అజాదీకా అమృత్ మహోత్సవాలను జరుపుకుంటున్న వేళ.. యావత్ దేశం హర్ ఘర్ తిరంగా కోసం సిద్ధంగా ఉంది. మన త్రివర్ణ పతాకాన్ని సంబరంగా జరుపుకునేందుకు సమష్టి చర్యలు అవసరం. నా సోషల్ మీడియా పేజీల్లో డీపీని మార్చాను. మీరు కూడా అదే పని చేయాలి’’ అని ప్రధాని కోరారు. ప్రధాని పిలుపు మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డా సైతం తమ ప్రొఫైల్ పిక్ లను మార్చుకున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)