Harda Factory Blast: హర్దా పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు ఆర్థిక సాయం
మరణించిన బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి పీఎం రిలీఫ్ ఫండ్ (PMNRF) నుంచి రూ.2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50,000 అందించనున్నట్లు వెల్లడించారు.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని హర్దా (Harda) పట్టణంలో గల ఓ పటాకుల తయారీ ఫ్యాక్టరీ (firecracker factory)లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 90 మందిదాకా గాయపడ్డారు. క్షతగాత్రులు హర్దా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అవసరమైన సహాయాన్ని స్థానిక యంత్రాంగం అందిస్తుందని హామీ ఇచ్చారు. మరణించిన బాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి పీఎం రిలీఫ్ ఫండ్ (PMNRF) నుంచి రూ.2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50,000 అందించనున్నట్లు వెల్లడించారు.
Here's PM Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)