Raja Saab New Poster: ప్రభాస్ రాజా సాబ్ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసిన మేకర్స్, గళ్ళ కోటు, నల్ల ప్యాంటు, టీ షర్ట్‌తో అదిరిపోయిన డార్లింగ్ లుక్
అక్టోబర్ 23న రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్‌డే కానుకగా రాజా సాబ్ నుంచి క్రేజీ అప్‌డేట్ ఉండబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా మూవీ నుంచి ప్రభాస్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం రాజా సాబ్ (Raaja Saab) నుంచి అప్ డేట్ వచ్చింది. అక్టోబర్ 23న రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్‌డే కానుకగా రాజా సాబ్ నుంచి క్రేజీ అప్‌డేట్ ఉండబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా మూవీ నుంచి ప్రభాస్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ గళ్ళ కోటు, నల్ల ప్యాంటు.. లోపల టీ షర్ట్‌తో అదిరిపోయాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.
శోభితా ధూళిపాళ, నాగ చైతన్యల ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం, చీరలో శోభిత ఎలా ఉందో చూశారా..
ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భలే భలే మొగాడివోయ్ ఫేమ్ మారుతి దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు.
Here's Prabhas New Look
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)