Tirupati Laddu Row: దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి, వారిపై మరో ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్, శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై మరో ట్వీట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనపై ఈరోజు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై మరో ట్వీట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటనపై ఈరోజు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన సమాచార క్లిప్పింగ్‌ను ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేస్తూ 'దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి' అని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.

కల్తీ నెయ్యిని లడ్డూ తయారికి వాడారా?, సీఎం చంద్రబాబు ప్రకటనకు ఆధారాలు లేవన్న సుప్రీం కోర్టు, తదుపరి విచారణ అక్టోబర్ 3కి వాయిదా

ప్రకాశ్ రాజ్ పోస్ట్ చేసిన క్లిప్పింగ్‌లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు ఉన్నాయి. తిరుపతి లడ్డూ విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని, దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని సూచించిందని అందులో పేర్కొన్నారు.లడ్డూకు సంబంధించిన రిపోర్ట్ ఎప్పుడో జులైలో వస్తే మీరు ఇప్పుడు స్టేట్‌మెంట్ ఎందుకు ఇచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించిన విషయాన్ని పేర్కొన్నారు.

Here's Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement