Pune Horror: వివాహేతర సంబంధముందని అనుమానం, వదినని, ఇద్దరు పిల్లల్ని దారుణంగా హత్య చేసిన మరిది, అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించిన కసాయి

పుణేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పలువురితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఒక వ్యక్తి తన వదినతోపాటు ఆమె ఇద్దరు పిల్లలను గొంతునొక్కి హత్య చేశాడు. అనంతరం పెట్రోల్‌ పోసి మృతదేహాలను దహనం చేసి పారిపోయాడు.

Representational Image | (Photo Credits: IANS)

పుణేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పలువురితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఒక వ్యక్తి తన వదినతోపాటు ఆమె ఇద్దరు పిల్లలను గొంతునొక్కి హత్య చేశాడు. అనంతరం పెట్రోల్‌ పోసి మృతదేహాలను దహనం చేసి పారిపోయాడు. ఇంటి నుంచి పొగలు, మంటల రావడం గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కాలిన మృతదేహాలను పరిశీలించారు. పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు వైభవ్‌ను గురువారం ఉదయం అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement