Farmers Protest: పంజాబ్ రైతులు మ‌ళ్లీ పోరుబాట, త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చాల‌ని కోరుతూ మూడు రోజుల రైల్ రోకో ఆందోళ‌న‌, వీడియో ఇదిగో..

త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చాల‌ని కోరుతూ పంజాబ్ రైతులు మ‌ళ్లీ పోరుబాట ప‌ట్టారు. మూడు రోజుల రైల్ రోకో (Rail Roko) ఆందోళ‌న‌లో భాగంగా రైతులు రైల్ ట్రాక్‌ల‌పైకి చేరి నిర‌స‌న తెల‌ప‌డంతో ఫిరోజ్‌పూర్ డివిజ‌న్‌లో 18 రైళ్లు నిలిచిపోయాయి.

Farmers (Photo-ANI)

త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చాల‌ని కోరుతూ పంజాబ్ రైతులు మ‌ళ్లీ పోరుబాట ప‌ట్టారు. మూడు రోజుల రైల్ రోకో (Rail Roko) ఆందోళ‌న‌లో భాగంగా రైతులు రైల్ ట్రాక్‌ల‌పైకి చేరి నిర‌స‌న తెల‌ప‌డంతో ఫిరోజ్‌పూర్ డివిజ‌న్‌లో 18 రైళ్లు నిలిచిపోయాయి. వ‌ర‌ద‌ల్లో న‌ష్ట‌పోయిన రైతుల‌ను ఆదుకునేందుకు ఆర్ధిక సాయం ప్ర‌క‌టించ‌డంతో పాటు, గిట్టుబాటు ధ‌ర‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించ‌డం, రుణ మాఫీ వంటి ప‌లు డిమాండ్లు నెర‌వేర్చాల‌ని కోరుతూ కిసాన్ మ‌జ్ధూర్ సంఘ‌ర్ష్ క‌మిటీ నేతృత్వంలో ప‌లు రైతు సంఘాలు మూడు రోజుల పాటు రైల్ రోకోకు పిలుపు ఇచ్చాయి.

2021లో లఖింపూర్ ఖేరి ఘ‌ట‌న‌లో ప్ర‌ధాన నిందితుడు కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా తేని కుమారుడు ఆశిష్ మిశ్రాపై చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్ రైతుల‌కు అన్యాయం చేయాల‌ని ఎవ‌రైనా త‌ల‌పెడితే పంజాబ్ రైతుల‌కు హ‌రియాణ రైతులు కూడా బాస‌ట‌గా నిలుస్తార‌ని కిసాన్ మ‌జ్దూర్ సంఘ‌ర్ష్ క‌మిటీకి చెందిన శ‌ర్వ‌న్ సింగ్ పంధేర్ వెల్ల‌డించారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now