Oxygen Shortage in Punjab: ఆక్సిజన్ అందక అమృత్‌సర్ ఆసుపత్రిలో 5 గురి మృతి, ప్రభుత్వ ఆసుపత్రులకు తొలి ప్రాధాన్యం ఇవ్వడం వల్లే ఘటన జరిగిందని తెలిపిన నీల్‌కాంత్ ఆసుపత్రి అధికారులు

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నఅయిదుగురు రోగులు ఆక్సిజన్ సరఫరా లేక ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐదుగురు కరోనా బాధితులు. రోగులు చనిపోయిన తర్వాత కొన్ని ఆక్సిజన్ సిలిండర్లు ఆసుపత్రికి సరఫరా అయ్యాయని నీల్‌కాంత్ ఆసుపత్రి అధికారులు తెలిపారు.

Neelkanth Hospital MD (Photo/ANI)

ప్రభుత్వ ఆసుపత్రులకు తొలి ప్రాధాన్యం ఇవ్వడం వల్లే సరిపడా సిలిండర్లను సరఫరా చేయలేకపోతున్నామని సప్లయర్లు తమతో చెప్పినట్టు పేర్కొన్నారు.సాయం చేయాలంటూ జిల్లా అధికారులను వేడుకుంటున్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండడం లేదని ఆసుపత్రి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ దేవగన్ తెలిపారు.

నీల్‌కాంత్ ఆసుపత్రిలో చనిపోయిన అయిదుగురిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. రోగులు చనిపోయిన తర్వాత 5 సిలిండర్లు మాత్రమే ఆసుపత్రికి అందాయన్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాను అడ్డుకునేందుకు ఆక్సిజన్ యూనిట్ల వద్ద భారీగా పోలీసులను మోహరించినట్టు ఆయన పేర్కొన్నారు.

ANI Update: 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement