Purvanchal Expressway Accident: పొద్దు పొద్దున్నే ఘెర రోడ్డు ప్రమాదం, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న రెండు బస్సులు, 8 మంది మృతి, సీఎం యోగీ సంతాపం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు డబుల్ డెక్కర్ ప్రైవేట్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.

Purvanchal Expressway Accident. (Photo Credits: ANI)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు డబుల్ డెక్కర్ ప్రైవేట్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన కత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాయణ్ పూర్ గ్రామ సమీపంలో జరిగింది.రెండు బస్సులు బీహార్ నుంచి ఢిల్లీకి వెళుతుండగా ఢీకొన్నాయి. ఓ బస్సు ఒక్కసారిగా ఆగిపోవడంతో వేగంగా వచ్చిన రెండో బస్సు ఢీకొట్టింది. క్షతగాత్రులను చికిత్స అనంతరం లక్నో ట్రామా సెంటర్‌కు తరలించారు.బారాబంకి పోలీసు యంత్రాంగం ప్రమాద స్థలానికి చేరుకుంది. ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now