Pushpa-2 First Half Report: పుష్ప-2 ఫస్ట్‌ హాఫ్‌ మైండ్‌ బ్లోయింగ్‌ అంటూ దేవిశ్రీప్రసాద్‌ కామెంట్స్ వైరల్, వీడియో ఇదిగో...

అల్లు అర్జున్‌, సుకుమార్‌ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పుష్ప-2 దిరూల్‌. పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌ ఇది. మైత్రీ మూవీ మేకర్స్‌ అండ్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి.

Allu Arjun Pushpa 2: The Rule Locks First Half pre-release business worth Rs 1000 crore Report

అల్లు అర్జున్‌, సుకుమార్‌ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పుష్ప-2 దిరూల్‌. పుష్ప ది రైజ్‌కు సీక్వెల్‌ ఇది. మైత్రీ మూవీ మేకర్స్‌ అండ్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్‌, రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. డిసెంబర్‌ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. అయితే అందరి ఊహించిన దానికంటే అద్భుతంగా సినిమా వుండబోతుందని చిత్ర యూనిట్‌ వర్గాలు చెబుతున్నాయి.

రూ. 1000 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసుకున్న పుష్ప-2, ఫస్ట్‌హాఫ్‌ ఎడిటింగ్‌తో పాటు అన్నిపనులు పూర్తిచేసుకుని లాక్‌ చేశారంటూ పోస్టర్

తాజాగా ఈ చిత్రం గురించి పుష్ప-2 సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సోమవారం హైదరాబాద్‌లో దేవిశ్రీప్రసాద్‌ లైవ్‌ కన్‌సర్ట్‌ గురించి ఏర్పాటు చేసిన ఓ వేడుకలో దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ ''పుష్ప-2 ఇటీవల ఫస్ట్‌ హాఫ్‌ చూశాను. మైండ్‌ బ్లోయింగ్‌గా వుంది. పుష్ప కథను ఇప్పుడే కాదు స్క్రిప్ట్‌ విన్నప్పుడే నేను లిరిక్‌ రైటర్‌ చంద్రబోస్‌ మూడు సార్లు క్లాప్స్‌ కొట్టాం.. సుకుమార్‌ కథ చెబుతున్నప్పుడు ఇక్కడ ఇంటర్వెలా.. ఇక్కడ ఇంటర్వెలా అని మేము అంటున్నాం.. అంతలా మాకు ప్రతి సీన్‌ కిక్‌ ఇచ్చింది. ప్రతి సీన్‌లోనూ ఎంతో ఎనర్జీ వుంటుందని తెలిపారు.

Here's Pushpa-2 first half report Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement