'Pushpa 2' Stampede: వీడియో ఇదిగో, రేవతి కుటుంబానికి రూ. 50 లక్షల చెక్కు అందించిన మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాత నవీన్ బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు అందజేశారు.
పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. నిర్మాత నవీన్ బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు అందజేశారు. సోమవారం నాడు ఆయన బాధిత కుటుంబాన్ని కలిసి చెక్కును అందజేశారు. ఈ నెల 4న సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందారు. ఆమె తనయుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. రేవతి కుటుంబానికి అండగా ఉంటామని నటుడు అల్లు అర్జున్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో మైత్రీ మూవీస్ సంస్థ బాధిత కుటుంబానికి రూ.50 లక్షలను అందించింది. వీడియో ఇదిగో, ఎర్ర చందనం దొంగలకు జాతీయ అవార్డులా? పుష్ప సినిమాపై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి సీతక్క
Pushpa 2 makers donate Rs 50 lakh to victims family
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)