Rajasthan: పెళ్లి వేడుకలో ఘోర విషాదం, పెళ్లి కొడుకుతో సహా 9 మంది అక్కడికక్కడే మృతి, ప్రమాదవశాత్తు చంబల్ నదిలో పడిపోయిన కారు
రాజస్థాన్‌లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు నదిలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఉజ్జయినిలో వివాహం చేసుకోవడం కోసం వెళ్తున్న పెళ్లి కొడుకు కారు ప్రమాదవశాత్తు కోటాలోని ఛోటీ పులియా వద్ద చంబల్ నదిలో పడిపోయింది.
రాజస్థాన్‌లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు నదిలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. ఉజ్జయినిలో వివాహం చేసుకోవడం కోసం వెళ్తున్న పెళ్లి కొడుకు కారు ప్రమాదవశాత్తు కోటాలోని ఛోటీ పులియా వద్ద చంబల్ నదిలో పడిపోయింది. కోట వద్ద చంబల్ నది (Chambal river) దాటుతుండగా అదుపుతప్పి అందులో పడిపోయింది. ఈ ప్రమాదంలో వరుడితో సహా తొమ్మిది మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నకోటా పోలీసులు క్రేన్ సాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నారు. పెళ్లి కొడుకు, కుటుంబ సభ్యుల మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Viral Video: యూపీలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు... ఏపీలో బొలెరో బోల్తా.. రెండు ప్రమాదాల వివరాలు ఇవిగో..!
Hyderabad Horror: డివైడర్ ను ఢీకొట్టి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం (వీడియో)
Advertisement
Advertisement