Rajasthan: నదిలోకి దూసుకెళ్లిన కారు, ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి, పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం, అతి వేగమే కారణమంటున్న అధికారులు
చంబల్ నదిలో కారు పడిపోవడంతో...ఎనిమిది మంది మృతి చెందారు(Eight people died ). వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. కోటాలోని (Kota) చోటి పులియా (Chhoti Puliya)ప్రాంతంలో ఈ ఘటన జరిగింది
Jaipur, Feb 20: రాజస్థాన్‌లో (Rajasthan) ఘోరప్రమాదం జరిగింది. చంబల్ నదిలో కారు పడిపోవడంతో...ఎనిమిది మంది మృతి చెందారు(Eight people died ). వివాహానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. కోటాలోని (Kota) చోటి పులియా (Chhoti Puliya)ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అత్యంత వేగంగా దూసుకువచ్చిన కారు...పక్కనే ఉన్న చంబల్ నదిలోకి (Chambal river)దూసుకెళ్లింది. నదిలో పడిన కారును క్రేన్ సాయంతో వెలికితీశారు. మృతదేహాలనను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వీరంతా ఒకే కటుంబానికి చెందినవారని ప్రాథమికంగా తెలిసింది. ప్రమాద ఘటనపై రాజస్థాన్ సీఎం తీవ్ర సంతాపం తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)