Rajasthan Horror: పెళ్లి ఇంట్లో అర్థరాత్రి పేలిన సిలిండర్, నలుగురు మృతి, 60 మందికి గాయాలు, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో విషాద ఘటన

పెళ్లి ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 60 మంది గాయపడ్డారు. భుంగ్రా గ్రామంలో ఓ ఇంట్లో వివాహ వేడుక జరుగుతున్న క్రమంలో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంట్లో సిలిండర్‌ పేలిపోయింది.

Credit @ ANI Twiter

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో భుంగ్రా గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. పెళ్లి ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 60 మంది గాయపడ్డారు. భుంగ్రా గ్రామంలో ఓ ఇంట్లో వివాహ వేడుక జరుగుతున్న క్రమంలో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంట్లో సిలిండర్‌ పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.

అక్రమంగా అవి ఇళ్లు మొత్తం వ్యాపించడంతో నలుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికుల సహకారంతో గాయపడినవారిని ఆస్పత్రికు తరలించారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారని, వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘనటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Here's ANI Updtae

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)