Rajasthan: దారుణం, బట్టలు విప్పి రేప్ గాయాలు చూపించమన్న మెజిస్ట్రేట్‌, పోలీసులకు ఫిర్యాదు చేసిన అత్యాచార బాధితురాలు, జడ్జిపై కేసు నమోదు

రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో గ్యాంగ్ రేప్ కు గురైన బాధితురాలి గాయాలు పరిశీలించేందుకు దుస్తులు విప్పాలని మెజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేయడం (Magistrate Asks Dalit Rape Survivor To Strip) సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. దీనికి ఆ మహిళ నిరాకరిస్తూ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది

Representative Image (Photo Credit- Pixabay)

రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో గ్యాంగ్ రేప్ కు గురైన బాధితురాలి గాయాలు పరిశీలించేందుకు దుస్తులు విప్పాలని మెజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేయడం (Magistrate Asks Dalit Rape Survivor To Strip) సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. దీనికి ఆ మహిళ నిరాకరిస్తూ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో మెజిస్ట్రేట్‌పై కేసు నమోదు చేశారు.మార్చి 19న దళిత మహిళపై అత్యాచారం జరిగింది. బాధితురాలి ఫిర్యాదుపై హిండౌన్ సదర్ పోలీస్ స్టేషన్‌లో మార్చి 27న కేసు నమోదైంది. విశాఖలో దారుణం.. లైంగిక వేధింపులతో చైతన్య ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య

మార్చి 30న హిండౌన్‌ కోర్టులో బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్‌ బాధితురాలి దుస్తులు విప్పి గాయాలు చూపించాలని ఆ మహిళతో అన్నాడు. దీనికి ఆమె నిరాకరించి..ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఐపీసీలోని సెక్షన్‌ 345తోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మెజిస్ట్రేట్‌పై కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎస్టీ, ఎస్టీ సెల్‌ డిప్యూటీ ఎస్పీ మీనా ఈ విషయం తెలిపారు.

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement