Rajasthan Road Accident: ఘోర రోడ్డు ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి, సిమెంట్ లోడ్‌తో వెళుతున్న ట్ర‌క్‌ను ఢీకొట్టిన కారు

రాజ‌స్ధాన్‌లోని హ‌నుమాన్‌ఘ‌ఢ్ వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదంలో (Road Accident) ఒకే కుటుంటానికి చెందిన ఏడుగురు వ్య‌క్తులు మ‌ర‌ణించారు. హ‌నుమాన్‌ఘ‌ఢ్‌-స‌ర్ధార్‌ష‌హ‌ర్ హైవేపై వారు ప్ర‌యానిస్తున్న కారు ట్ర‌క్కును ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిందని పోలీసులు ఆదివారం తెలిపారు.ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో పిల్ల‌లతో స‌హా 9 మంది కారులో ప్ర‌యాణిస్తున్నారు.

Representative Image

రాజ‌స్ధాన్‌లోని హ‌నుమాన్‌ఘ‌ఢ్ వ‌ద్ద ఘోర రోడ్డు ప్ర‌మాదంలో (Road Accident) ఒకే కుటుంటానికి చెందిన ఏడుగురు వ్య‌క్తులు మ‌ర‌ణించారు. హ‌నుమాన్‌ఘ‌ఢ్‌-స‌ర్ధార్‌ష‌హ‌ర్ హైవేపై వారు ప్ర‌యానిస్తున్న కారు ట్ర‌క్కును ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగిందని పోలీసులు ఆదివారం తెలిపారు.ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో పిల్ల‌లతో స‌హా 9 మంది కారులో ప్ర‌యాణిస్తున్నారు. ప్ర‌మాదంలో ఏడుగురు కుటుంబ‌స‌భ్యులు ఘ‌ట‌నా స్ధ‌లంలోనే మ‌ర‌ణించ‌గా ఇద్ద‌రికి గాయాల‌య్యాయి. వారు ప్ర‌యాణిస్తున్న కారు సిమెంట్ లోడ్‌తో వెళుతున్న ట్ర‌క్‌ను ఢీ కొన‌డంతో ఈ దుర్ఘ‌ట‌న జ‌రిగింది. బాధిత కుటుంబం రాజ‌స్ధాన్‌లోని హనుమాన్‌ఘ‌ఢ్ స‌మీపంలో నురంగ్‌దేశ‌ర్ గ్రామానికి చెందిన‌ద‌ని పోలీసులు వెల్ల‌డించారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now