Rajasthan Shocker: రాజస్థాన్‌లో దారుణం..టైలర్ తలను నరికేసిన ఇద్దరు వ్యక్తులు, నూపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టులు పెట్టినందుకు తల్వార్లతో దాడి చేసి హతమార్చిన దుండుగులు

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో దారుణ ఘటన జరిగింది. మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నూపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టులు పెట్టిన ఓ టైలర్‌ ని తలను ఇద్దరు వ్యక్తులు దారుణంగా నరికేశారు. టైలర్‌ తన దుకాణంలో పనిలో ఉండగా లోనికి ప్రవేశించిన దుండగులు బుధవారం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

Murder (Photo Credits: Pixabay)

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో దారుణ ఘటన జరిగింది. మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నూపుర్‌ శర్మకు మద్దతుగా పోస్టులు పెట్టిన ఓ టైలర్‌ ని తలను ఇద్దరు వ్యక్తులు దారుణంగా నరికేశారు. టైలర్‌ తన దుకాణంలో పనిలో ఉండగా లోనికి ప్రవేశించిన దుండగులు బుధవారం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అందరూ చూస్తుండగానే తల్వార్లతో దాడి చేసి హతమార్చారు. అంతేకాకుండా ప్రధాని మోదీ, నూపుర్‌ శర్మ ప్రాణాలు కూడా తీస్తామంటూ కత్తులు చూపిస్తూ సెల్ఫీ వీడియో ద్వారా బెదిరించారు.

టైలర్‌ హత్యోదంతంతో ఉదయ్‌పూర్‌లోని మల్డాస్‌ ప్రాంతంలో ఉద్రిక్తలు చెలరేగాయి. స్థానికులు దుకాణాలను మూసేశారు. హత్య ఘటనను నిరసిస్తూ వందలాది మంది రోడ్లపైకి వచ్చిన నిరసనలు తెలిపారు. ఈఘటనపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ స్పందించారు. టైలర్‌ హత్యకు గురికావడం అత్యంత బాధాకరమన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఉదయ్‌పూర్‌లో పోలీసులు 24 గంటలపాటు నగరంలో ఇంటర్‌నెట్‌ సేవలను నిలుపుదల చేశారు. నూపుర్‌ శర్మకు మద్దతుగా టైలర్‌ ఎనిమిదేళ్ల కొడుకు గతంతో ఆమె ఫొటో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసినట్టు తెలిసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement