Rajgarh Road Accident: అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి, పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్​ బోల్తా, విషాదకర వీడియో ఇదిగో..

రాజస్థాన్‌లోని మోతీపురాకు చెందిన 30 మంది మధ్యప్రదేశ్‌లోని కులంపూర్‌కు పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్​ బోల్తా పడటంతో 13 మంది మృతి చెందగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Rajgarh Road Accident (Photo Credit: X/@AdityaRajKaul)

మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రాజస్థాన్‌లోని మోతీపురాకు చెందిన 30 మంది మధ్యప్రదేశ్‌లోని కులంపూర్‌కు పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్​ బోల్తా పడటంతో 13 మంది మృతి చెందగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై సీఎం మోహన్ యాదవ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఘటనపై విచారణ జరుగుతోందని రాజ్‌గఢ్ కలెక్టర్ హర్ష్ దీక్షిత్ తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.  పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, భారీ వర్షానికి రోడ్డుపై విరిగిపడ్డ చెట్టు కొమ్మలను తప్పించే క్రమంలో అదుపుతప్పి బోల్తా పడిన బస్సు, ఒకరు మృతి

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif