PM Modi Apologise to Lord Shri Ram: శ్రీరాముడికి క్షమాపణలు చెప్పిన ప్రధాని మోదీ, ఇన్ని శతాబ్దాలుగా ఈ కార్యం చేయలేకపోవడం మన లోటంటూ భావోద్వేగం
ఇన్ని శతాబ్దాలుగా ఈ పని చేయలేని మన ప్రయత్నం, త్యాగం, తపస్సులో ఏదో లోటు ఉండాలి. ఈరోజు పని పూర్తయింది. భగవంతుడు ఈరోజు మనల్ని తప్పకుండా క్షమిస్తాడని నేను నమ్ముతున్నానని ప్రధాని అన్నారు.
ప్రధాన మంత్రి మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ట (Pran Pratishtha) కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. రామనామ స్మరణతో అయోధ్య మారుమోగిపోయింది. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘రామ్ లల్లా ఇప్పుడు గుడారంలో ఉండడు.. మహా మందిరంలోనే ఉంటాడు...’ అని అన్నారు. ఆ కాలంలో 14 ఏళ్లు మాత్రమే ఎడబాటు... ఈ యుగంలో అయోధ్య, దేశప్రజలు వందల ఏళ్లుగా విడిపోయారు. మన తరాలలో చాలా మంది ఈ వేర్పాటును అనుభవించారు..." శ్రీరాముడి ఉనికిపై న్యాయ పోరాటం దశాబ్దాలుగా కొనసాగింది. న్యాయం చేసినందుకు భారత న్యాయవ్యవస్థకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..."
ఈరోజు నేను కూడా శ్రీరామునికి క్షమాపణలు చెబుతున్నాను. ఇన్ని శతాబ్దాలుగా ఈ పని చేయలేని మన ప్రయత్నం, త్యాగం, తపస్సులో ఏదో లోటు ఉండాలి. ఈరోజు పని పూర్తయింది. భగవంతుడు ఈరోజు మనల్ని తప్పకుండా క్షమిస్తాడని నేను నమ్ముతున్నానని ప్రధాని అన్నారు. శ్రీరాముడు ఇప్పుడు గుడిసెలో కాదు, మహా మందిరంలో ఉంటాడు, బాలరాముడి ప్రాణప్రతిష్ట అనంతరం ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Here's Video