Ramesh Bidhuri Abusive Remarks: వీడియో ఇదిగో, లోక్ సభ సాక్షిగా ముస్లిం ఎంపీని టెర్రరిస్ట్, ఉగ్రవాది అని దూషించిన బీజేపీ ఎంపీ ర‌మేష్ బిధురి

బీఎస్పీ నేత డానిష్ అలీపై బీజేపీ ఎంపీ ర‌మేష్ బిధురి లోక్ సభ వేదికగా తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు.లోక్‌స‌భ‌లో శుక్ర‌వారం చంద్ర‌యాన్‌-3 మిష‌న్ స‌క్సెస్‌పై చ‌ర్చ సంద‌ర్భంగా కాషాయ పార్టీ ఎంపీ..బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని విమ‌ర్శిస్తూ ఉగ్ర‌వాది, తార్పుడుగాడు, టెర్రరిస్ట్, ఉగ్రవాది వంటి అభ్యంత‌ర‌క‌ర ప‌దాలు ఉపయోగించారు.

BJP Lok Sabha MP Ramesh Bidhuri and Speaker Om Birla. (Photo Credits: Twitter | IANS)

బీఎస్పీ నేత డానిష్ అలీపై బీజేపీ ఎంపీ ర‌మేష్ బిధురి లోక్ సభ వేదికగా తీవ్ర అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు.లోక్‌స‌భ‌లో శుక్ర‌వారం చంద్ర‌యాన్‌-3 మిష‌న్ స‌క్సెస్‌పై చ‌ర్చ సంద‌ర్భంగా కాషాయ పార్టీ ఎంపీ..బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని విమ‌ర్శిస్తూ ఉగ్ర‌వాది, తార్పుడుగాడు, టెర్రరిస్ట్, ఉగ్రవాది వంటి అభ్యంత‌ర‌క‌ర ప‌దాలు ఉపయోగించారు. బీజేపీ ఎంపీ ముస్లి వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేశార‌ని స‌భ‌లో ర‌గ‌డ జ‌ర‌గ‌డంతో స్పీక‌ర్ స్పందించారు.

స‌హ‌చ‌ర స‌భ్యుడిపై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేయ‌డంపై స్పీక‌ర్ ఓంబిర్లా బీజేపీ స‌భ్యుడు ర‌మేష్ బిధురిని హెచ్చ‌రించారు.బీజేపీ ఎంపీ వ్యాఖ్య‌ల‌ను విప‌క్ష స‌భ్యులు తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఇక బీజేపీ ఎంపీ వ్యాఖ్య‌ల‌ను రికార్డుల నుంచి తొల‌గించారు. బీఎస్పీ ఎంపీ అలీపై బిధురి చేసిన అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల ప‌ట్ల ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ లోక్‌స‌భ‌లో విచారం వ్య‌క్తం చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌ను తాను విన‌లేద‌ని, అయితే అవి విప‌క్ష స‌భ్యులకు ఇబ్బంది క‌లిగిస్తే వాటిని స‌భ రికార్డుల నుంచి తొల‌గించాల‌ని స్పీక‌ర్‌ను కోరారు. వీడియో ఇదిగో..

BJP Lok Sabha MP Ramesh Bidhuri and Speaker Om Birla. (Photo Credits: Twitter | IANS)

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement