Rameshwaram Cafe Blast: బెంగుళూరు రామేశ్వరం కేఫ్‌లో పేలింది బాంబులే సిలిండర్ కాదు, స్పష్టం చేసిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, బ్యాగులో ఉన్న ఐఈడీ కారణంగానే పేలుళ్లు జరిగాయని నిర్థారణ
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. అందరూ గ్యాస్ సిలిండర్ పేలిందని అనుకుంటున్న సమయంలో అది బాంబు పేలుళ్లే అని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఓ వ్యక్తి కేఫ్‌లో బ్యాగు పెట్టి వెళ్లిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని తెలిపారు.

ఆ బ్యాగులో ఉన్న ఐఈడీ కారణంగానే పేలుళ్లు జరిగాయని పేర్కొన్నారు.ఈ పేలుడు ధాటికి 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు సంభవించిన వెంటనే భయంతో హోటల్ సిబ్బంది, కస్టమర్లు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. బాంబు స్క్వాడ్, క్లూస్ టీం అధికారులు అక్కడికి చేరుకుని ఆధారాలను సేకరించారు.గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. బెంగుళూరు నగరంలో భారీ పేలుడు, అయిదుగురుకి తీవ్ర గాయాలు, సిలిండర్ పేలుడా? ఏదైనా కుట్ర ఉందా? పరిశోధిస్తున్న పోలీసులు
Here's CM Tweet