బెంగుళూరు నగరంలో వైట్‌ఫీల్డ్‌లోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం మధ్యాహ్నాం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో అయిదుగురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పేలుడు గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. ఫైర్‌ సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.

‘‘సిలిండర్‌ పేలిందన్న సమాచారంతో మేం ఇక్కడికి చేరుకున్నాం. గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించాం. భారీ శబ్ధంతో పేలుడు సంభవించే సరికి భయంతో పరుగులు తీసినట్లు స్థానికులు చెబుతున్నారు. సిలిండర్‌ పేలుడా? ఏదైనా కుట్ర ఉందా? అనేది పోలీసులు తేలుస్తారు’’ అని వైట్‌ఫీల్డ్‌ ఫైర్‌ స్టేషన్‌ అధికారి తెలిపారు.

Here's ANI Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)