HC on Ration Card: రేషన్ కార్డు అంటే అడ్రస్ ప్రూఫ్ కాదు, ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు, అది ప్రజాపంపిణీ కోసమేనని స్పష్టం చేసిన ధర్మాసనం

రేషన్ కార్డు అంటే అడ్రస్ ప్రూఫ్ కాదని, అది కేవలం ప్రజాపంపిణీ కోసమేనని ఢిల్లీ హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. రేషన్ కార్డును అడ్రస్ లేదా నివాసానికి సంబంధించిన రుజువుగా పరిగణించలేమని తెలిపింది.

Delhi High Court (Photo Credits: PTI)

Ration Card is Not A Address Proof: రేషన్ కార్డు అంటే అడ్రస్ ప్రూఫ్ కాదని, అది కేవలం ప్రజాపంపిణీ కోసమేనని ఢిల్లీ హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. రేషన్ కార్డును అడ్రస్ లేదా నివాసానికి సంబంధించిన రుజువుగా పరిగణించలేమని తెలిపింది. ప్రజాపంపిణీ వ్యవస్థ కింద నిత్యావసర వస్తువులను పొందడానికి ప్రత్యేకంగా రేషన్ కార్డు జారీ చేస్తారన్నారు. కాబట్టి దీనిని ప్రూఫ్‌గా చూడలేమని తెలిపింది.  వంట గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్, రూ.300 సబ్సిడీ మరో సంవత్సరం పాటు పొడిగింపు

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్ర ధరి సింగ్, కాత్పుత్లీ కాలనీలోని పూర్వపు నివాసితులు ఈ ప్రాంతాన్ని తిరిగి అభివృద్ధి చేసిన తర్వాత పునరావాస పథకం కింద ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు తప్పనిసరి ధ్రువీకరణపత్రంగా రేషన్ కార్డు ఉండాలని నోటీసులో అధికారులు పేర్కొన్నారు. దీనిని హైకోర్టు తప్పుబట్టింది. ఈ నిర్ణయం ఏకపక్షం, చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.

  Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement