Republic Day 2024: గదర్ పాటకు స్టెప్పులేసి రిపబ్లిక్ డే విషెస్ తెలిపిన రష్యా, ఎక్స్ వేదికగా షేర్ చేసిన రష్యా దౌత్య కార్యాలయం
ఈ సందర్భంగా పలు దేశాలు భారత్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా (Russia) సైతం భారత్ (India)కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.
భారత్ 75వ గణతంత్ర దినోత్సవ (Republic Day) వేడుకలను ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా పలు దేశాలు భారత్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రష్యా (Russia) సైతం భారత్ (India)కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటించిన ‘గదర్’ (Gadar) చిత్రంలోని ఓ పాటకు రష్యా ఎంబసీ (Russian Embassy) ఉద్యోగులు, చిన్నారులు, ప్రొఫెషనల్ డ్యాన్సర్లు ఎంతో ఉత్సాహంగా స్టెప్పులేశారు. అనంతరం ‘హ్యాపీ రిపబ్లిక్ డే’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోని న్యూఢిల్లీలోని రష్యా దౌత్య కార్యాలయం ఎక్స్ వేదికగా షేర్ చేసింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)