Sandhya Theatre Tragedy: వీడియో ఇదిగో, నా డబ్బులతో శ్రీతేజ్ పేరిట మృత్యుంజ‌య హోమం జరిపిస్తా, వేణు స్వామి కీలక వ్యాఖ్యలు, రేవ‌తి భ‌ర్త భాస్క‌ర్‌కు రూ. 2ల‌క్ష‌ల చెక్కు అందజేత

ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్లో 'పుష్ప-2' ప్రీమియ‌ర్ షో తొక్కిస‌లాట‌లో మృతి చెందిన రేవ‌తి కుటుంబానికి వేణుస్వామి ఆర్థిక సాయం చేశారు. రేవ‌తి భ‌ర్త భాస్క‌ర్‌కు రూ. 2ల‌క్ష‌ల చెక్కును అంద‌జేశారు.

Venu Swamy Donates Rs 2 lakhs to Sritej father Bhaskar

ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్లో 'పుష్ప-2' ప్రీమియ‌ర్ షో తొక్కిస‌లాట‌లో మృతి చెందిన రేవ‌తి కుటుంబానికి వేణుస్వామి ఆర్థిక సాయం చేశారు. రేవ‌తి భ‌ర్త భాస్క‌ర్‌కు రూ. 2ల‌క్ష‌ల చెక్కును అంద‌జేశారు. అలాగే ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ శ్రీతేజ్ పేరిట మృత్యుంజ‌య హోమం కూడా చేస్తాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. అంత‌కుముందు కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను వేణుస్వామి ప‌రామ‌ర్శించారు.

రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

ఇక‌ బాధిత కుటుంబానికి 'పుష్ప-2' టీమ్ రూ. 2 కోట్ల భారీ పరిహారాన్ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అల్లు అర్జున్ తరపున రూ. కోటి, మైత్రి మూవీ మేక‌ర్స్‌, దర్శకుడు సుకుమార్ చెరో రూ. 50 లక్షలు ఇచ్చారు. రూ. 2 కోట్లకు చెందిన చెక్కులను దిల్ రాజుకు అందజేశారు. అలాగే శ్రీతేజ్ వైద్యం కోసం సుకుమార్ స‌తీమ‌ణి తబిత రూ. 5లక్ష‌లు అంద‌జేశారు. కోమటిరెడ్డి ప్ర‌తీక్ రెడ్డి ఫౌండేష‌న్ కూడా రూ. 25లక్ష‌ల ఆర్థిక సహాయం అంద‌జేసింది.

Venu Swamy Donates Rs 2 lakhs to Sritej father Bhaskar 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now