Allu Aravind (photo-Video Grab)

హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను చూసేందుకు అల్లు అరవింద్‌, దిల్‌ రాజు, సుకుమార్‌ వెళ్లారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి వారు తెలుసుకున్నారు. రేవతి కుటుంబానికి అల్లు అ‍ర్జున్‌ పేరుతో అల్లు అరవింద్‌ భారీ సాయం ప్రకటించారు.

శ్రీతేజ ఆరోగ్య పరంగా త్వరగా కోలుకోవాలని రూ. 1 కోటి అరవింద్‌ ప్రకటించారు. డైరెక్టర్‌ సుకుమార్‌ రూ. 50 లక్షలు అందించారు. అయితే, మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే రూ. 50 లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం రూ. 2 కోట్ల రూపాయలు చెక్కులను తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా దిల్‌ రాజుకు అందించారు.

ప్రభుత్వాల మద్దతుతోనే ఎదిగిన చిత్ర పరిశ్రమ..చట్టం తన పని తాను చేసుకుపోతోందన్న మంచు విష్ణు..మా సభ్యులు స్పందించొద్దని వినతి

రేవతి భర్త భాస్కర్‌తో అల్లు అరవింద్‌ మాట్లాడారు. శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన తెలుసుకున్నారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ.. ' ఈ విపత్తు అనంతరం అబ్బాయి కోలుకుంటున్నాడు. త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నాను.

రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్

శ్రీతేజ కుటుంబానికి మైత్రీ మూవీస్‌ నిర్మాతలు నవీన్, రవిశంకర్‌తో పాటు దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ తరపున మొత్తం రూ.2 కోట్లు ఇస్తున్నాం. ఈ చెక్‌లను ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న దిల్ రాజుకి ఇస్తున్నాం.' అని పేర్కొన్నారు.