Sanjay Gaikwad Sparks Controversy: వీడియో ఇదిగో, రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్
(Sanjay Gaikwad) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు ఇస్తానని ప్రకటించారు.
శివసేన ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. (Sanjay Gaikwad) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి రూ.11 లక్షలు ఇస్తానని ప్రకటించారు. రిజర్వేషన్ వ్యవస్థను రద్దు చేయాలంటూ రాహుల్ గాంధీ అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ బుధవారం స్పందించారు. ‘ఇటీవల అమెరికా పర్యటనలో రిజర్వేషన్‌లను అంతం చేయడం గురించి రాహుల్ గాంధీ మాట్లాడారు.
రిజర్వేషన్‌లను అంతర్లీనంగా వ్యతిరేకించే ఆయన మనస్తత్వాన్ని ఇది చూపుతున్నది. రాహుల్ గాంధీ నాలుకను కోసే ఎవరికైనా నేను 11 లక్షల రివార్డ్ ఇస్తా’ అని మీడియాతో అన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలతో ప్రజలకు అతి పెద్ద ద్రోహం చేశారని శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఆరోపించారు. మరాఠాలు, ధన్‌గర్లు, ఓబీసీలు వంటి వర్గాలు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాయని అన్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)