Sexual Harassment Allegations: బీజేపీ ఎంపీపై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ మహిళా రెజ్లర్లు(Wrestlers) ఢిల్లీలో ధర్నా చేస్తున్న సంగతి విదితమే.తాజాగా వీరంతా ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ మహిళా రెజ్లర్లు(Wrestlers) ఢిల్లీలో ధర్నా చేస్తున్న సంగతి విదితమే.తాజాగా వీరంతా ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఆ పిటీషన్‌ను స్వీకరించింది. రెజ్లర్లు చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, ఈ కేసును శుక్రవారం విచారించనున్నట్లు ధర్మాసనం తెలిపింది.ఈ కేసులో ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ప్రభుత్వంతో పాటు ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు ఇచ్చినట్లు రెజ్లర్ల తరపున న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు.
Here's ANI Tweet