Sonu Sood: తెలుగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన సోనూసూద్, మంచినీరు, ఆహారం, మెడికల్ కిట్స్ అందిస్తామని ప్రకటన
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వర్షాలు, వరదలతో యుద్ధం చేస్తున్నాయని, ఇలాంటి అవసరమైన సమయంలో వారికి అండగా ఉంటామని సోనూసూద్ పేర్కొన్నారు. ప్రజలు తమ తమ సహాయ అభ్యర్థనలను పంపించేందుకు సోనూసూద్‌కు చెందిన చారిటీ ఫౌండేషన్ ఈ-మెయిల్‌ను ఇచ్చారు.
భారీ వర్షాలు, వరదలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు విలవిలలాడాయి. ఎంతోమంది వరదల్లో చిక్కుకుపోయారు. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటం కోసం, వారికి నిత్యావసరాలు అందించేందుకు ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు.ప్రముఖ నటుడు సోనూసూద్ తెలుగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. మంచినీరు, ఆహారం, మెడికల్ కిట్స్ అందివ్వడంతో పాటు తాత్కాలిక షెడ్స్ ఏర్పాటు చేసేందుకు తన బృందం కృషి చేస్తుందన్నారు. వరద బాధితులకు అండగా ప్రభాస్, ఏకంగా రూ.5 కోట్ల విరాళం, తెలుగు ప్రజల కోసం కదలి రావాలన్న మాజీ సీజేఐ ఎన్వీ రమణ
ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వర్షాలు, వరదలతో యుద్ధం చేస్తున్నాయని, ఇలాంటి అవసరమైన సమయంలో వారికి అండగా ఉంటామని సోనూసూద్ పేర్కొన్నారు. ప్రజలు తమ తమ సహాయ అభ్యర్థనలను పంపించేందుకు సోనూసూద్‌కు చెందిన చారిటీ ఫౌండేషన్ ఈ-మెయిల్‌ను ఇచ్చారు. తద్వారా ఆయన సహాయం చేయడంతో పాటు తన చారిటీ ద్వారా వనరులను సమకూర్చే ప్రయత్నం చేస్తున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)