Road Accident Video: షాకింగ్ సీసీ పుటేజీ ఇదిగో, ఫుట్‌పాత్‌పై నడుస్తున్న విద్యార్థులపైకి దూసుకొచ్చిన కారు, యువకుడు మృతి, యువతికి తీవ్ర గాయాలు
కాలేజీ విద్యార్థులైన యువతి, యువకుడు గురువారం పటేల్ నగర్‌లోని ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్నారు. వేగంగా వచ్చిన కారు ఫుట్‌పాత్‌పై నడుస్తున్న విద్యార్థుల మీదకు దూసుకెళ్లింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఫుట్‌పాత్‌పై నడుస్తున్న ఇద్దరు విద్యార్థులు పైకి కారు దూసుకొచ్చింది. కాలేజీ విద్యార్థులైన యువతి, యువకుడు గురువారం పటేల్ నగర్‌లోని ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్నారు. వేగంగా వచ్చిన కారు ఫుట్‌పాత్‌పై నడుస్తున్న విద్యార్థుల మీదకు దూసుకెళ్లింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. యువకుడు మరణించాడు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)