Sri Lanka's Squad For ODI Series: భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు శ్రీలంక జట్టు ప్రకటన, ఆ స్టార్ ఆటగాళ్లకు నో ఛాన్స్
ఈ జట్టుకు ఆల్‌రౌండర్ చరిత్ అసలంక కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కుసాల్ మెండిస్‌ను తప్పించి వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అసలంకకు లంక క్రికెట్ అప్పగించింది.
భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్ చరిత్ అసలంక కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కుసాల్ మెండిస్‌ను తప్పించి వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అసలంకకు లంక క్రికెట్ అప్పగించింది. టీమిండియాతో టీ20 సిరీస్‌కు దూరమైన సదీర సమరవిక్రమ, కరుణరత్నే, స్పిన్ ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలగే వన్డే జట్టుకు ఎంపికయ్యారు. సీనియర్ ఆల్‌రౌండర్లు దసున్ షనక, మథ్యూస్, స్టార్ పేసర్లు దుష్మాంత చమీరా, నువాన్ తుషారాలకు చోటు దక్కలేదు. ఆగస్టు 2న కొలంబో వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్ కైవసం చేసుకున్న భారత్, రెండో టీ 20లో 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించిన టీమిండియా
భారత్‌తో వన్డే సిరీస్‌కు లంక జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, నిషాన్ మదుష్క, వనిందు హసరంగా, దునిత్ వెల్లలగే, చమిక కరుణరత్నే, మహేశ్ తీక్షణ, అకిల దనంజయ, దిల్షన్ మదుశంక, మతీష పతిరన, అసిత ఫెర్నాండో
Here's Team Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)