Supreme Court: సుప్రీంకోర్టు నూతన జడ్జీలుగా 5గురు ప్రమాణ స్వీకారం, తాజా నియామకంతో 27 నుంచి 32కు పెరగనున్న న్యాయమూర్తలు సంఖ్య
రాజస్థాన్, పాట్నా, మణిపూర్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు జస్టిస్ మనోజ్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
సుప్రీంకోర్టు కొత్త న్యాయమూర్తులుగా నియమితులైన ఐదుగురు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజస్థాన్, పాట్నా, మణిపూర్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు జస్టిస్ మనోజ్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ నియామకంతో సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య సీజేఐతో కలిపి ప్రస్తుతమున్న 27 నుంచి 32కు చేరనుంది. అత్యున్నత న్యాయస్థానంలో వాస్తవంగా 34 మంది జడ్జీలు ఉండాల్సింది.న్యాయమూర్తుల నియామకం, బదిలీలకు సంబంధించి కొలీజియం సిఫారసులకు ఆమోదం తెలపడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుండటంపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)