Tamil Nadu Fire: తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం, బాణాసంచా ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు, ఆరుగురు సజీవ దహనం, మరికొంతమందికి గాయాలు

తమిళనాడు కాంచీపురం జిల్లాలో కురువిమలైలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మరికొంత మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

Fire Accident (Photo-ANI)

తమిళనాడు కాంచీపురం జిల్లాలో కురువిమలైలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మరికొంత మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్‌, పోలీస్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో పాతిక మంది పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు, ఘటనకు సంబంధించి అదనపు సమాచారం అందాల్సి ఉంది.

Here's ANI Update

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement