Tamil Nadu: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, బయటకు వచ్చిన సీసీ టీవీ పుటేజీ, 12 మంది కళాశాల విద్యార్థులతో సహా 40 మందికి గాయాలు

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సేలం జిల్లా శంకరి సమీపంలో మంగళవారం సాయంత్రం రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఎడప్పాడి నుంచి శంకరి వెళ్తున్న ప్రైవేటు బస్సు.. తిరుచెంగోడ్‌ నుంచి వస్తున్న కళాశాల బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Tamil Nadu Road Accident(Photo-Video grab)

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సేలం జిల్లా శంకరి సమీపంలో మంగళవారం సాయంత్రం రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఎడప్పాడి నుంచి శంకరి వెళ్తున్న ప్రైవేటు బస్సు.. తిరుచెంగోడ్‌ నుంచి వస్తున్న కళాశాల బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది కళాశాల విద్యార్థులతో సహా 40 మంది గాయాలయ్యాయి. భాదితులంతా సేలం, ఎడప్పాడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సులోని సీసీ కెమెరాలో ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. డ్రైవర్‌ తన సీట్లోంచి ముందుకు ఎగిరిపడటం, బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతినడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కాగా డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని తేలింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement